Modi Neeraj Chopra : నీ విజయం దేశానికి గర్వ కారణం
నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ ప్రశంస
Modi Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో జరిగిన పోటీలో తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు భారత్ కు చెందిన నీరజ్ చోప్రా. కానీ సిల్వర్ (రజత) పతకాన్ని సాధించాడు.
ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడు కావడం విశేషం. భారతీయ క్రీడా (అథ్లెటిక్స్ ) చరిత్రలో కొత్త చరిత్రకు నాంది పలికిన నీరజ్ చోప్రాను ప్రత్యేకంగా ప్రశంసించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నీరజ్ చోప్రాను(Modi Neeraj Chopra) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నీవు సాధించిన విజయం అపురూపమని, దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు నరేంద్ర మోదీ.
ఒక రకంగా చెప్పాలంటే కష్టానికి దక్కిన ప్రతిఫలం. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని తెలిపారు.
యావత్ 133 కోట్ల భారతీయుల తరపున అభినందనలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
వర్దమాన క్రీడాకారులకు నీ విజయం స్పూర్తి దాయకంగా నిలుస్తుందని కొనియాడారు పీఎం. భారత దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతోంది. ప్రత్యేకించి క్రీడా రంగంలో తనదైన ముద్ర వేస్తోందని తెలిపారు మోదీ.
ఈ క్షణం .. ఈసన్నివేశం భారతీయ క్రీడలకు ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీరజ్ చోప్రా 88.14 మీటర్ల బెస్ట్ ప్రయత్నంతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
ఇదిలా ఉండగా అథ్లెటిక్స్ పరంగా జావెలన్ త్రోలో రజత పతకం సాధించిన రెండో క్రీడాకారుడిగా అరుదైన ఘనత సాధించాడు చోప్రా.
Also Read : చోప్రా విజయం అంతటా సంబురం