PM Modi : రాజ్య‌స‌భ‌కు నామినేట్ పీటీ ఉష‌కు పీఎం కంగ్రాట్స్

అరుదైన అవ‌కాశం క‌ల్పించిన న‌రేంద్ర మోదీ

PM Modi : భార‌త దేశంలో న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఊహంచ‌ని నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌ధానంగా క్రీడా రంగానికి ఎన‌లేని చేయూత‌ను అందిస్తోంది.

స‌మున్న‌త భార‌తావ‌ని గ‌ర్వించేలా దేశానికి పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకు వ‌చ్చిన ప‌రుగుల రాణి పీటీ ఉష‌కు అరుదైన అవ‌కాశాన్ని క‌ల్పించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి. పీటీ ఉష‌ను (PT Usha)  రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన పీటీ ఉష‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు న‌రేంద్ర మోదీ. పీటీ ఉష భార‌త దేశంలోని 130 కోట్ల మందికి స్పూర్తి దాయ‌కంగా నిలిచారు.

క్రీడ‌ల‌లో ఆమె సాధించిన విజ‌యాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వ‌ర్ధ‌మాన క్రీడాకారుల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో పీటీ ఉష చేసిన కృషి అద్భుత‌మ‌ని కొనియాడారు ప్ర‌ధాన మంత్రి(PM Modi) .

పెద్ద‌ల స‌భ‌కు నామినేట్ అయినందుకు ఆమెను అభినందిస్తున్నాన‌ని పేర్కొన్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. భార‌త దేశానికి ప‌రుగు పందెంలో మొట్ట మొద‌టి సారిగా బంగారు ప‌త‌కాన్ని తీసుకు వ‌చ్చింది పీటీ ఉష‌.

దేశ క్రీడా చ‌రిత్ర‌లో అదో మైలు రాయిగా పేర్కొన‌డంలో త‌ప్పు లేదు. ఇదిలా ఉండ‌గా భార‌త ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ద‌శాబ్దాలుగా సృజ‌నాత్మ‌క ప్ర‌పంచంతో అనుబంధం క‌లిగి ఉన్న వి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. ఆయ‌న ర‌చ‌న‌లు భార‌త దేశానికి సంబంధించిన సంస్కృతిని ప్ర‌తిబింబిస్తాయ‌ని కితాబు ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాని తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ప‌లువురు స్వాగ‌తిస్తున్నారు.

Also Read : శిఖ‌ర్ ధావ‌న్ బ‌న్ గ‌యా వ‌న్డే జ‌ట్టు కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!