PM Modi : తేజస్విన్ శంకర్ కు ప్రధాని అభినందన
కామన్వెల్త్ గేమ్స్ 2022లో కాంస్య పతకం
PM Modi : బ్రిటన్ లోని బర్మింగ్ హొమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బంగారు, రజతం, కాంస్య పతకాలు సాధించారు.
వెయిట్ లిఫ్టింగ్ లో ఎక్కువ పతకాలు దక్కాయి. భారత్ ఖాతాలో రోజూ ఏదో ఒక పతకం చేరుతూ వస్తోంది. ఈ పోటీల్లో చారిత్రాత్మకమైన కాంస్య పతకం సాధించినందుకు హై జంపర్ తేజస్విన్ శంకర్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభినందించారు.
పురుషుల హై జంప్ ఫైనల్ లో భారత ఆటగాడు తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల మార్కుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని స్పందించారు.
తన అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా తేజస్విన్ శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు. అతడు అద్భుతం చేశాడు..చరిత్ర సృష్టించాడని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పురుషుల హైజంప్ ఈవెంట్ లో దేశానికి తొలి పతకాన్ని సాధించాడు శంకర్. నువ్వు చేసిన ప్రయత్నం చూస్తే తనకు గర్వంగా ఉందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
అతడి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
కాగా న్యూజిలాండ్ కు చెందిన హమీష్ కేర్ ఈ ఈవెంట్ లో 2.25 మీటర్ల హర్డిల్ ను క్లియర్ చేయడంతో స్వర్ణం గెలుపొందాడు.
గతంలో లేని రీతిలో ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు చెందిన క్రీడాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వర్ణాలు, రజతాలు, కాంస్య పతకాలు సాధించారు.
Also Read : టోల్ ట్యాక్స్ కు తాను తండ్రి లాంటోడిని