PM Modi Flags : ఈశాన్య రాష్ట్రంలో వందే భార‌త్ ట్రైన్

ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi Flags : ఈశాన్య రాష్ట్రానికి చెందిన తొలి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమ‌వారం జెండా ఊపి ప్రారంభించారు(PM Modi Flags). ఈ ప్రాంతంలో ప‌ర్యాట‌కం, విద్య‌, వాణిజ్యం , ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా మోదీ స్ప‌ష్టం చేశారు. గౌహ‌తి స్టేష‌న్ నుండి రైలుకు ప‌చ్చ జెండా ఊపారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ , అస్సాం గ‌వ‌ర్న‌ర్ చంద్ క‌టారియా, సీఎం హిమంత్ బిస్వా శ‌ర్మ హాజ‌ర‌య్యారు. గౌహ‌తి , న్యూ జ‌ల్ఫై గురి మ‌ధ్య సెమీ హై స్పీడ్ రైలు అస్సాం, ప‌శ్చిమ బెంగాల్ మ‌ధ్య క‌నెక్టివిటీని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌న్నారు.

గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాల‌లో రైల్వే నెట్ వ‌ర్క్ తో అనుసంధానించ బ‌డిన అన్ని రాష్ట్రాల‌తో ఈశాన్య ప్రాంతాలు మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ది చేశాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పారు.

నిజ‌మైన సామాజిక న్యాయం, లౌకిక వాదాన్ని ప్ర‌తిబింబించేలా ఎలాంటి వివ‌క్ష లేకుండా మౌలిక స‌దుపాయాలు అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తాయ‌ని స్పష్టం చేశారు. అత్యాధునిక రైలు ఈ ప్రాంతంలో ప‌ర్యాట‌కాన్ని పెంపొందించ‌డంతో పాటు వేగం, సౌక‌ర్యంతో ప్ర‌యాణించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. గ‌హౌతి – న్యూ జ‌ల్పాయిగురి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైలు కేవ‌లం 5 గంట‌ల 30 నిమిషాల్లో క‌వ‌ర్ చేస్తుంది.

Also Read : Sengol Comment

 

Leave A Reply

Your Email Id will not be published!