PM Modi : దేశంలో 5జీ సేవ‌లు పారా హుషార్

ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi : టెలికాం రంగంలో మ‌రో మైలు రాయికి చేరుకుంది భార‌త దేశం. రాకెట్ కంటే స్పీడ్ గా అందించే 5జీ సేవ‌ల‌ను దేశ‌మంత‌టా విస్త‌రించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శ‌నివారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా 5జీ స‌ర్వీసులు ప్రారంభించ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని పేర్కొన్నారు మోదీ(PM Modi). దీని వ‌ల్ల ప్ర‌ధాన రంగాల‌కు మేలు చేకూరుతుంద‌ని, భార‌త దేశ ఆర్థిక అభివృద్దికి దోహ‌దం చేస్తుంద‌ని అన్నారు. మొబైల్ కాంగ్రెస్ లో ప్ర‌ధాన‌మంత్రి 5జీ సేవ‌ల‌ను ప్రారంభిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇందులో భాగంగా మొద‌టి ద‌శ‌లో దేశంలోని 3 న‌గ‌రాల‌లో అందుబాటులోకి వ‌స్తుంది 5జీ స‌ర్వీసెస్. వ‌చ్చే రెండు సంవ‌త్స‌రాలలో 5జీ టెక్నాల‌జీని దేశమంతటా ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

న్యూఢిల్లీ లోని ప్ర‌గ‌తి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 4 రోజుల ఈవెంట్ ను ప్రార‌భించారు ప్ర‌ధాన‌మంత్రి. మొద‌టి ద‌శ‌లో 13 న‌గ‌రాల‌లో 5జీ స‌ర్వీసులు(5G Services) వెంట‌నే అమ‌లులోకి వ‌స్తాయి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించిన 5జీ స‌ర్వీసులు దేశంలోని అహ్మ‌దాబాద్, బెంగ‌ళూరు, చండీగ‌ఢ్ , చెన్నై, ఢిల్లీ, గాంధీ న‌గ‌ర్, గురుగ్రామ్ , హైద‌రాబాద్ , జామ్ న‌గ‌ర్ , కోల్ క‌తా, ల‌క్నో , ముంబై , పూణే ల‌లో ప్రారంభం కానున్నాయి.

ఇక పూణే, చెన్నై, ఢిల్లీ, కోల్ క‌తా, ముంబై నాలుగు మెట్రో న‌గ‌రాల‌కు ఇవాల్టి నుంచే 5జీ స‌ర్వీసులు స్టార్ట్ అవుతాయి. కాగా మొబైల్ కాంగ్రెస్ అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డీఓటీ) , సెల్యూలార్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వ‌హిస్తోంది.

Also Read : 5జీ టెస్టింగ్ మోదీ కారు డ్రైవింగ్ స‌క్సెస్

Leave A Reply

Your Email Id will not be published!