PM Modi Meets Kannada Industry : మోదీతో సినీ, క్రీడా దిగ్గ‌జాలు భేటీ

ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి

PM Modi Meets : ఇండియా వైమానిక ద‌ళం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఏరో ఇండియా 2023ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా బెంగ‌ళూరుకు చేరుకున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ప్ర‌ముఖ న‌టీ న‌టులు, క్రీడాకారులు భేటీ అయ్యారు. మోదీతో ప్ర‌త్యేకంగా విందు ఏర్పాటు చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన వారితో పాటు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు సైతం స‌మావేశం అయ్యారు.

క్రికెట‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్ , మ‌నీష్ పాండే , వ్యాపార‌వేత్త‌లు త‌రుణ్ మెహ‌తా, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు , ఆథ‌ర్ ఎన‌ర్జీ, జీరోధా కో ఫౌండ‌ర్ నిఖిల్ కామ‌త్ క‌లిసిన వారిలో ఉన్నారు.

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుటు య‌ష్ , రిష‌బ్ శెట్టి, మాజీ క్రికెట‌ర్లు అనిల్ కుంబ్లే , జ‌వ‌గ‌ల్ శ్రీ‌నాథ్ , వెంక‌టేశ్ ప్ర‌సాద్ ఉన్నారు. రాజ్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన విందు లో వీరంతా హాజ‌ర‌య్యారు(PM Modi Meets Kannada Industry). ప్ర‌ధాన‌మంత్రి మోదీతో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ , క‌మెడియ‌న్ శ్ర‌ద్ద‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

ద‌క్షిణాదిలో సినిమా, క్రీడా రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త ఉంద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. భార‌తీయ సంస్కృతి, న‌వ భార‌త దేశం, క‌ర్ణాట‌క పురోగ‌తికి వారు చేయాల్సిన సేవ‌ల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఇందులో ప్ర‌ధానంగా క‌న్న‌డ‌, సంస్కృతి, సినిమా, థియేట‌ర్లు, సినిమా ప‌రిశ్ర‌మ‌, క్రీడలు , క్రీడా మౌలిక స‌దుపాయాలు, క్రికెట్ ,యువ‌త సాధికార‌త‌, ప్ర‌తిభ , వ్యాపారం , అవ‌కాశాలు మొద‌లైన అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి.

Also Read : రూ. 3.4 కోట్ల‌తో స్మృతీ మంధాన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!