SLW vs BANW T20 World Cup : బంగ్లాకు షాక్ శ్రీ‌లంక ఝ‌ల‌క్

మ‌హిళా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హ‌వా

SLW vs BANW T20 World Cup : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ మ‌హిళ‌ల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో శ్రీ‌లంక దుమ్ము రేపుతోంది. అండ‌ర్ డాగ్స్ గా టోర్నీలో అడుగు పెట్టిన శ్రీ‌లంక అమ్మాయిలు అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. తొలి మ్యాచ్ లో ఆతిథ్య స‌ఫారీ జ‌ట్టుకు చుక్క‌లు చూపించిన ఈ జ‌ట్టు రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై(SLW vs BANW T20 World Cup) ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో విక్ట‌రీ న‌మోదు చేసింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జ‌ట్టు 8 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 18.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 129 ర‌న్స్ చేసింది. దీంతో 7 వికెట్ల‌తో సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. ప్ర‌ధానంగా శ్రీ‌లంక జ‌ట్టులో హ‌ర్షిత స‌మ‌ర విక్ర‌మ , నీలాక్షి డిసిల్వా అజేయంగా ఏకంగా 100 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌రుస‌గా ఐసీసీ టోర్నీలో రెండో విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం విశేషం.

శ్రీ‌లంక గెలుపులో స‌మ‌ర విక్ర‌మ , డిసిల్వ లు కీల‌క పాత్ర పోషించారు. స‌మ‌ర విక్ర‌మ 69 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. డిసిల్వ 41 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచింది. ఈ ఇద్ద‌రు బంగ్లాదేశ్ కు చుక్క‌లు చూపించారు. మొదట్లోనే 26 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన స‌మ‌ర విక్ర‌మ‌, డిసిల్వ‌లు చుక్క‌లు చూపించారు. మ‌రో వికెట్ ప‌డ‌కుంగా ప‌ని కానిచ్చేశారు. ఇక భార‌త జ‌ట్టు తొలి మ్యాచ్ లోనూ విజ‌యం సాధించి జోరు మీదుంది.

Also Read : రూ. 3.4 కోట్ల‌తో స్మృతీ మంధాన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!