PM Modi Mother : నిలకడగా మోదీ తల్లి హీరా బెన్ ఆరోగ్యం
ఆమె త్వరగా కోలుకోవాలని రాహుల్ ట్వీట్
PM Modi Mother : అనారోగ్యం కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ తల్లి హీరా బెన్(PM Modi Mother) బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ తన తల్లిని కలుసుకున్నారు.
ఆమె ఆశీర్వాదం కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా హీరా బెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఆస్పత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తన తల్లి అనారోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందారు ప్రధాన మంత్రి.
మోదీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఆస్పత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అక్కడే ఉన్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చివరి దశ పోలింగ్ సందర్భంగా మోదీ తల్లి హీరా బెన్(PM Modi Mother) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
1923 జూన్ 18న పుట్టారు హీరా బెన్. ఇటీవలే 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు ప్రధానమంత్రి. నా జీవితంలో ప్రతిదీ నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇవాళ నేను ఢిల్లీలో ఉన్నా నా మనసు అంతా నా తల్లి వద్దనే ఉందని పేర్కొన్నారు. తల్లి ఆప్యాయత బిడ్డలో మానవీయ విలువలు, సానుభూతిని నింపేలా చేస్తుందని అన్నారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోదీ తల్లి హీరా బెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read : లోకాయుక్త బిల్లుకు మరాఠా ఆమోదం