PM Modi Mother : తల్లి ఆరోగ్యం పదిలం మోదీ సంతోషం
హీరా బెన్ త్వరలో డిశ్చార్జి అవుతారన్న సీఎం
PM Modi Mother : నిన్న హఠాత్తుగా అనారోగ్యంతో అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిన ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తల్లి హీరా బెన్ ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రధాని మోదీ. ఆమెను ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా హీరా బెన్ మోదీ వయస్సు ప్రస్తుతం 99 ఏళ్లు. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన విలువైన ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రచారం చేపట్టిన ప్రధాన మంత్రి తన తల్లి(PM Modi Mother) వద్దకు వెళ్లారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాల్టితో హీరా బెన్ మోదీ ఆస్పత్రిలో చేరి రెండు రోజులు అవుతోంది.
ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. హీరా బెన్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే బయటకు వస్తారని , ఇంట్లో తన పనులు తాను చేసుకుంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ తరపున సీఎం భూపేష్ పటేల్ కీలక ప్రకటన చేశారు.
హీరా బెన్ మోదీ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సీఎం. ఓరల్ డైట్ ఇస్తున్నారని కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. కాగా ప్రధాన మంత్రి మోదీ బుధవారం తల్లిని పరామర్శించారు. గంటకు పైగా గడిపారు. ఆస్పత్రి నుండి బయలుదేరారు.
ఇదిలా ఉండగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
Also Read : ఘటన బాధాకరం మృతులకు సంతాపం