PM Modi : టీమిండియాకు మోదీ కితాబు
ఆసియా కప్ 2023 విజేత సూపర్
PM Modi : చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్ 2023లో చాలా గ్యాప్ తర్వాత నిర్వహించిన క్రికెట్ మెన్స్ , విమెన్స్ టోర్నీలలో భారత క్రికెట్ పురుషుల, మహిళల జట్లు అద్భుతమైన ప్రదర్శన చేపట్టాయి. ఏకంగా మెడల్స్ సాధించి ఔరా అనిపించేలా చేశాయి. ఈసారి ఆసియా క్రీడల్లో భారత దేశానికి చెందిన క్రీడాకారులు దుమ్ము రేపారు. ఏకంగా 107 పతకాలకు పైగా సాధించారు. ఇది దేశ క్రీడా చరిత్రలో ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు.
PM Modi Praises Indian Teams
రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ పరంగా విజేతగా నిలిచింది. శ్రీలంక జట్టును 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ పురుషుల, మహిళా క్రికెటర్లను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్మ మోదీ(PM Modi) . ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే జోరును మున్ముందు సాగాలని ఆకాంక్షించారు. మరో వైపు ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో కూడా భారత్ జగజ్జేతగా నిలవాలని కోరారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : Vijay Sai Reddy : తెలుగుదేశం ఆరి పోయే దీపం