PM Modi’s Q&A : మీ విజయం దేశానికి ఆదర్శనీయం
థామస్, ఉబర్ కప్ విజేతలతో మోదీ
PM Modi’s Q&A : భారత దేశ ప్రధాన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల అనంతరం భారత పురుష బ్యాడ్మింటన్ జట్టు ప్రతిష్టాత్మకమైన థామస్ కప్ ను స్వంతం చేసుకుంది. 14 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాకు షాక్ ఇస్తూ జగజ్జేతగా నిలిచింది.
ఈ సందర్భంగా స్వదేశానికి విచ్చేసిన థామస్ కప్, ఉబెర్ కప్ విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు ఢిల్లీలోని ప్రధాన మంత్రి(PM Modi’s Q&A ) నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో ముచ్చటించారు.
వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం క్రీడా రంగానికి, క్రీడాకారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మీ విజయం దేశానికి ఆదర్శనీయమని, స్పూర్తి దాయకమని కొనియాడారు.
మీ గెలుపు భావి తరాలకు ఓ పాఠంగా నిలిచి పోతుందన్నారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రికి ఆటగాళ్లు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అందించిన సహకారం తాము మరిచి పోలేమన్నారు.
ఇదిలా ఉండగా ఆటగాళ్లు తమ ఆట లోని విభిన్న కోణాలు, మైదానం వెలుపల వారి కుటుంబాలు, నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్లతో ఆయన సంభాషించారు.
ప్రధాన మంత్రి(PM Modi’s Q&A ) ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తమతో కలిసి ప్రత్యేక సమయాన్ని కేటాయించడం ఆనందంగా ఉందన్నారు కిదాంబి శ్రీకాంత్. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే తమకు ఫోన్ చేసి మాట్లాడారు.
మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారంటూ కితాబు ఇచ్చారు. మోదీ చేసిన ప్రసంగం మమ్మల్ని ఉత్తేజితుల్ని చేసింది. అంతకంటే ఎక్కువగా మేము మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదం పడుతుందన్నారు పుల్లెల గోపీచంద్.
Also Read : మోదీ సర్కార్ నిర్ణయం హాస్యాస్పదం