PM Modi : సంక్షేమం లక్ష్యం అభివృద్ది నినాదం
ప్రకటించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi : తాము అభివృద్ధే నినాదంగా ముందుకు వెళుతున్నామని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). బీజేపీ హయాంలో సాధికారత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో మహా వంటశాలను గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఏకంగా ఒకేసారి లక్ష మందికి సరిపడా వంట చేయగల సామర్థ్యం కలిగిన మెగా వంట శాలను వారణాసి లోని ఎల్టీ కాలేజీలో ఏర్పాటు చేశారు.
ఇది దేశంలోనే ప్రత్యేకమైన వంటశాలగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడారు.
గతంలో పాలకులు తమ స్వార్థం కోసం, తమ ఆస్తులు పెంచు కోవడం కోసం ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక దేశంలోని ప్రతి భారతీయుడికి సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు మోదీ.
సాధికారత సాధించేంత వరకు తాను నిద్ర పోనని అన్నారు. దేశంలోని పేదలు, సామాన్యులు, అణగారిన, వెనుకబడిన, గిరిజనులు, మహిళలు ప్రతి ఒక్కరు సగర్వంతో తమ కాళ్ల మీద తాము నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi).
ఇదిలా ఉండగా ఈ వంట శాలను ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అక్షయపాత్ర చేస్తున్న సామాజిక సేవను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు ప్రధానమంత్రి.
ఈ సంస్థ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోందన్నారు. ఈ వంట శాల ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన భోజనం దక్కుతుందన్నారు.
Also Read : సంగీత దిగ్గజం సమున్నత శిఖరం