PM Modi : సుస్థిర‌త‌..సుప‌రిపాల‌న ముఖ్యం – మోదీ

ప్ర‌జ‌లు మెరుగైన పాల‌న కోరుకుంటున్నారు

PM Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు సుస్థిర‌మైన‌, మెరుగైన పాల‌నను కోరుకుంటున్నార‌ని దానిని తాము గ‌త 9 ఏళ్లుగా అందిస్తున్నామ‌ని చెప్పారు. అభివృద్ది, సుప‌రిపాల‌న‌, పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన యంత్రాంగం , స‌మ‌ర్థ‌వంతమైన నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌న్నారు. గ‌తంలో పాల‌కులు దేశాన్ని దోచుకునేందుకు మాత్ర‌మే వాడుకున్నార‌ని ఆరోపించారు మోదీ.

PM Modi Said

కానీ తాము అధికారంలోకి వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. ఇవాళ దేశంలో ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు సామాన్యుల‌కు అందుతున్నాయ‌ని వెల్ల‌డించారు. మిత్ర‌ప‌క్షాల ముందు త‌మ ఎజెండా సానుకూలంగా ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి.

విప‌క్షాలు అవినీతి, అక్ర‌మాల‌తో కూరుకు పోయాయ‌ని కానీ ఎన్డీయే అలా కాద‌న్నారు. దానికంటూ ఓ ల‌క్ష్యం ఉంద‌న్నారు. ఇది ఎవ‌రితోనూ ప్ర‌తిపక్షం కాద‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు న‌రేంద్ర మోదీ. ప్ర‌జ‌లంద‌రినీ అభివృద్దిలో భాగ‌స్వామ్యం చేయాల‌న్న‌దే త‌న సంక‌ల్ప‌మ‌న్నారు. ఇవాళ యావ‌త్ ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంద‌ని, దీనికి కార‌ణం బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వ ప‌నితీరు అని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi).

రాబోయే ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మైన‌వ‌ని, దీనిని దృష్టిలో ఉంచుకుని మ‌రింత ఉత్సుక‌త‌తో ప‌ని చేయాల‌ని కోరారు మోదీ.ఇప్ప‌టికే గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. ఇవాళ ప్ర‌పంచ ఆర్థిక రంగంలో భార‌త్ కూడా కీల‌క‌మైన పాత్ర పోషించే స్థాయికి చేరుకుంద‌న్నారు. వీట‌న్నింటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని సూచించారు.

Also Read : Ponguleti Srinivas Reddy : గాంధీ భ‌వ‌న్ లో పొంగులేటి

Leave A Reply

Your Email Id will not be published!