PM Modi Tour : రిషి సున‌క్ తో భేటీ కానున్న మోదీ

ఇండోనేషియాలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న

PM Modi Tour : భార‌త సంత‌తికి చెందిన రిషి సున‌క్ ఇటీవ‌లే బ్రిట‌న్ కు ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఇదే స‌మ‌యంలో మాజీ ప్ర‌ధాన మంత్రి బోరిక్ జాన్సన్ భార‌త్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్, బ్రిట‌న్ దేశాల మ‌ధ్య వాణిజ్య‌, వ్యాపార సంబంధాలు మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఇదే స‌మ‌యంల రిషి సున‌క్ సార‌థ్యంలో త‌మ దేశం అన్ని రంగాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషించే స్థాయికి చేరుకుంటుంద‌ని తెలిపారు జాన్స‌న్. ఈ త‌రుణంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇండోనేషియాలో(PM Modi Tour) ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా బ్రిట‌న్ పీఎం రిషి సున‌క్ తో పాటు ఫ్రాన్స్ చీఫ్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ల‌తో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.
ఇదిలా ఉండ‌గా ఇండోనేషియా లోని బాలిలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జీ20 స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది.

ఇందులో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ కీల‌క స‌మ్మిట్ న‌వంబ‌ర్ 15, 16 తేదీల్లో జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం జ‌రిగే ఈ జీ20 స‌ద‌స్సు 17వ‌ది. భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విన‌య్ క్వాత్రా ప్ర‌కారం ఇండోనేషియాలో దాదాపు 45 గంట‌ల పాటు ఉంటారు మోదీ.

ఈ స‌మ‌యంలో ఆహారం, ఇంధ‌న భ‌ద్ర‌త‌, డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌న‌, ఆరోగ్యంపై మూడు కీల‌క‌మైన వ‌ర్కింగ్ సెష‌న్స్ కు ప్ర‌ధాన‌మంత్రి హాజ‌ర‌వుతారు. ప్రెసిడెంట్ జోకో విడోడో వ‌చ్చే ఏడాది జ‌రిగే స‌మావేశానికి జి20 అధ్య‌క్ష ప‌ద‌విని న‌రేంద్ర మోదీకి అధికారికంగా అప్ప‌గించ‌నున్నారు. దీంతో ఈ స‌ద‌స్సు కీల‌కంగా మార‌నుంది.

Also Read : స‌రిహ‌ద్దు ఉద్రిక్తం ఆర్మీ చీఫ్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!