PM Modi Tribute : పీవీ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం – మోదీ

జూన్ 28 మాజీ ప్ర‌ధాని జ‌యంతి

PM Modi Tribute : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ దేశ మాజీ దివంగ‌త ప్ర‌ధాన మంత్రి పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు (పీవీ)ని స్మ‌రించుకున్నారు. ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. పీవీతో త‌న‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా గుర్తు చేసుకున్నారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి స్మ‌రించుకున్నారు. జూన్ 28న మాజీ ప్ర‌ధాని పీవీ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ఈ త‌రం నేత‌ల్లో ఎన్నద‌గిన‌, ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకోద‌గిన నాయ‌కుడు పీవీ న‌ర‌సింహారావు అని పేర్కొన్నారు మోదీ.

అత్యంత ప్ర‌తిభావంతుడు, స్నేహ శీలి అంత‌కు మించిన గొప్ప నాయ‌క‌త్వ నైపుణ్యం క‌లిగిన నాయ‌కుడు అని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి(PM Modi). భార‌త దేశం అభివృద్దికి ఆయ‌న చేసిన సేవ‌లు, అనుస‌రించిన విధానాలు చాలా గొప్ప‌వ‌ని అన్నారు మోదీ. దూర దృష్టి ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గిన‌ద‌ని అన్నారు. దేశ ప్ర‌గ‌తికి పీవీ చేసిన సేవ‌లు ఇప్ప‌టికీ ఎన్న‌ద‌గిన‌వ‌ని స్ప‌ష్టం చేశారు మోదీ.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వారు పీవీ న‌ర‌సింహారావు. 1971 నుండి 1973 దాకా ఏపీ సీఎంగా ఉన్నారు. దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న కాలంలోనే ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. గొప్ప మేధావి. బ‌హుముఖ వ్య‌క్తిత్వం క‌లిగిన నాయ‌కుడు. బహు భాషా వేత్త‌, ప్ర‌సిద్ద ర‌చ‌యిత‌, దేశా నిర్మాణం కోసం అహ‌ర్నిశ‌లు త‌పించిన గొప్ప వ్య‌క్తి .

Also Read : PM Modi : భార‌త్ ప‌త‌కాల పంట మోదీ ప్ర‌శంస‌

 

Leave A Reply

Your Email Id will not be published!