PM Modi K Viswanath : దిగ్గజ దర్శకుడు కళాతపస్వి – మోదీ
సినీ లోకానికి తీరని లోటు
PM Modi K Viswanath : దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ లేరన్న విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. కళాతపస్వి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన సినీ ప్రపంచలో దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా సినీ లోకంలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారని కొనియాడారు ప్రధానమంత్రి.
వివిధ ఇతివృత్తాలతో కె. విశ్వనాథ్ తీసిన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి..ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు నరేంద్ర మోదీ(PM Modi) ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రధాని.
ఇదిలా ఉండగా కళాపతస్విని ఎన్నో అవార్డులు , పురస్కారాలు వరించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయననను ఘనంగా సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డు దక్కింది.
కె. విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన వయస్సు 92 ఏళ్లు. తన జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం సహాయ దర్శకుడిగా పని చేశారు. 1961లో ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన కుల వ్యవస్థ, వైకల్యం, అంటరానితనం, లింగ వివక్ష, వరకట్నం, సామాజిక ఆర్థిక సవాళ్లు వంటి ఇతివృత్తాలతో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also Read : కళాతపస్వి చిరంజీవి – భరణి