PM Narendra Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా చేరుకున్న ప్రధాని మోదీ !

రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా చేరుకున్న ప్రధాని మోదీ !

PM Narendra Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీ కి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్‌ డ్యాన్స్‌ ట్రూప్‌ ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో భారత ప్రధానిని స్వాగతించింది.

PM Narendra Modi Tour

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లారు. రెండు రోజుల పాటు పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక మోదీ కోసం పుతిన్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.

Also Read : Telangana DSC: షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ ! ఎలాంటి మార్పు లేదు !

Leave A Reply

Your Email Id will not be published!