Shahbaz Sharif : పాకిస్తాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఓవైపు అవిశ్వాస తీర్మానంతో కేవలం 2 ఓట్ల తేడాతో ఓటమి పాలై ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ భారత్ , అమెరికా పట్ల వ్యతిరేక వైఖరి నుంచి తప్పుకున్నారు.
ఆయన త్వరగా యూటర్న్ తీసుకున్నారు. పదవి నుంచి దిగి పోయే కంటే ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ విదేశాంగ విధానం అవలంభిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క ఇండియానేనని పేర్కొన్నారు.
అఖండ భారతంలో ప్రజలు తమ దేశం కోసం ఏమైనా చేసేందుకు సిద్దంగా ఉంటారని ప్రశంసించారు. దీనిని తప్పు పట్టాయి విపక్షాలు. పాకిస్తాన్ ఎందుకు దండగ ఇండియాలో మకాం పెడితే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ తరుణంలో కొత్త పీఎంగా కొలువు తీరిన షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif)తన పంథాను మార్చుకున్నట్టే కనిపించారు. కొత్తగా కొలువు తీరిన పీఎంను భారత దేశ ప్రధానమంత్రి అభినందించారు.
షరీఫ్ వెంటనే రిప్లై ఇచ్చారు. భారత్ తో సత్ సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే ఇంకో వైపు భారత్ లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే ప్రయ్నతం చేశారు.
పాకిస్తాన్ కు సంబంధించి ఎవరు వచ్చినా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని చూసినా భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. అటు ఆర్థిక పరంగా ఇటు నిరుద్యోగం ఇబ్బందులు పెడుతోంది. ఈ సమయంలో భారత్ తో సత్ సంబంధాలు కోరుకోవడం తప్ప మరో మార్గం లేదు.
తాను సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆఫ్గనిస్తాన్ సైతం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది.
Also Read : పాకిస్తాన్ కు తాలిబన్లు స్ట్రాంగ్ వార్నింగ్