PM Modi Heeraben : ఈసారి అమ్మ వద్దకు వెళ్ల లేక పోయా – మోదీ
ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మంత్రి
PM Modi Heeraben : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు. సరిగ్గా ఇదే రోజు 1950లో గుజరాత్ లో జన్మించారు. ఇంకా మోదీ తల్లి హీరా బెన్ జీవించి ఉన్నారు.
71 ఏళ్లు పూర్తయి 72వ ఏట అడుగు పెట్టారు ప్రధానమంత్రి. ప్రతి పుట్టిన రోజుకు తన తల్లి వద్దకు వెళతారు. ఆమె ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవాళ తాను అనివార్య కారణాల వల్ల వెళ్లలేక పోయానని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ మధ్య ప్రదేశ్ లోని పార్కులో మూడు చిరుత పులులను విడుదల చేశారు.
దేశంలో చిరుతలు లేక పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. మొత్తం ఎనిమిది చిరుతలను నమీబియా నుంచి ఇండియాకు తెప్పించారు. నమీబియాతో చేసుకున్న ఒప్పందం ఏమరకు కునో నేషనల్ పార్క్ లో కొలువు తీరాయి.
అనంతరం కొన్ని గంటలు ముగిశాక నరేంద్ర మోదీ స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు. తను మరోసారి తన తల్లి హీరా బెన్ ను తల్చుకున్నారు(PM Modi Heeraben).
సాధారణంగా ఇవాళ నేను మా తల్లిని సందర్శించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆమె పాదాలను తాకి, ఆశీర్వాదం తీసుకుంటానని స్పష్టం చేశారు మోదీ.
అయితే మధ్య ప్రదేశ్ లో లక్షలాది మంది మహిళలు, తల్లులు నాకు వారి ఆశీస్సులు అందజేస్తున్నారని కొనియాడారు. గత శతాబ్దానికి ఈ శతాబ్దానికి మధ్య దేశంలోని మహిళల ప్రాతినిధ్యంలో భారీ మార్పు చోటు చేసుకుందన్నారు.
గ్రామ సంస్థల నుంచి రాష్ట్రపతి భవన్ దాకా మహిళా శక్తి దేశాన్ని శాసిస్తోందన్నారు నరేంద్ర మోదీ.
Also Read : బిల్కిస్ బానో కోసం పాదయాత్రకు సిద్ధం