PM Vishwakarma Yojana : పీఎం విశ్వకర్మ యోజన
మోదీ గ్రీన్ సిగ్నల్
PM Vishwakarma Yojana : దేశంలోని కుల వృత్తి దారులకు ఖుష్ కబర్ చెప్పారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). సబ్సిడీ కింద రూ. 2 లక్షలు ఇవ్వనుండడం విశేషం. 30 లక్షల మందికి ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు సంబంధించి రూ. 13,000 వేల కోట్ల ఖర్చు చేయనున్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల వృత్తి పని వారికి ఎంతో మేలు కలుగుతుంది.
PM Vishwakarma Yojana New Scheme
77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా జాతీయ జెండగా ఎగుర వేశారు మోదీ. ఈ సందర్బంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పని చేసుకునే వారికి ఖుష్ కబర్ చెప్పారు. వారందరికీ మేలు చేకూర్చేలా సాయం చేస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి దీనిని ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఈ పీఎం విశ్వ కర్మ పథకం కింద కేటాయించిన నిధులను 5 ఏళ్ల పాటు ఖర్చు చేస్తామన్నారు. 18 సంప్రదాయ వృత్తులకు దీని వల్ల లాభం కలుగుతుందన్నారు. చేతి వృత్తిదారులకు విశ్వకర్మ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. రెండు విడతలుగా సాయం చేస్తామని తెలిపారు. తొలి విడత రూ. లక్ష , రెండో విడత మరో లక్ష ఇస్తామని తెలిపారు.
Also Read : Mandakrishna Madiga : కుల పిచ్చోడు రేవంత్ రెడ్డి