Pocharam Srinivas Reddy : బాబు ఆవేదన పోచారం ఆందోళన
మాజీ సీఎం గొప్ప నాయకుడట
Pocharam Srinivas Reddy : తెలంగాణ – రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా పసుపు వాసన పోనట్టు కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను తీసుకు వచ్చింది కూడా మనోడే. తన సామాజిక వర్గానికి మేలు చేకూర్చేలా , హైదరాబాద్ ను సర్వ నాశనం చేశారన్న ఆరోపణలు కూడా చంద్రబాబుపై ఉన్నాయి.
Pocharam Srinivas Reddy Comments Viral
ప్రపంచ బ్యాంకుకు ద్వారాలు తెరవడమే కాదు వందలాది మంది తెలంగాణ బిడ్డలను ఎన్ కౌంటర్ల పేరుతో మట్టు బెట్టిన చరిత్ర చంద్రబాబుదే. అంతే కాదు నయీంను తీసుకు వచ్చింది, ఆయన వెనుక ఉన్నది కూడా ఈయనేనన్న విమర్శలు లేక పోలేదు. ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు గంప గుత్తగా మద్దతు ఇచ్చింది కూడా చంద్రబాబేనని ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడం విస్తు పోయేలా చేసింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో అత్యంత సీనియర్ నాయకుడంటూ కితాబు ఇచ్చారు. కేవలం కక్ష సాధింపు చర్యగా బాబు అరెస్ట్ ను పేర్కొన్నారు స్పీకర్.
Also Read : Revanth Reddy : కల్వకుంట్ల కుటుంబం జైలుకే