Revanth Reddy : తాండూరు – తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని నిట్ట నిలువునా దోచుకుని , లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ విజయ భేరి యాత్ర సందర్బంగా తాండూరులో చేపట్టిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Revanth Reddy Comments on KCR
ఇప్పటికే దేశంలోని పేరు పొందిన సర్వే సంస్థలతో పాటు రాష్ట్రానికి చెందిన కీలక సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తుందని ప్రకటించాయని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
రాష్ట్రంలో అందినంత మేర దోచుకున్నాడని, కల్వకుంట్ల కుటుంబం చేసిన అరాచకాల గురించి చెబితే ఏడాది పడుతుందని అన్నారు. ఇక దోపిడీకి పరాకాష్టగా మారిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, వినోద్ కుమార్ లను అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓడి పోతే తాను రెస్ట్ తీసుకుంటానంటూ ప్రకటించారని , ఆయన ఇంత కాలం చేసింది ఏముందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). అచ్చోసిన ఆంబోతుల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మారారంటూ ఆరోపించారు. ప్రజలు వీరిని సహించే పరిస్థితుల్లో లేరన్నారు.
Also Read : DK Shiva Kumar : బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి కేరాఫ్
