Ali Jawad Zaidi : జస్టిస్ రమణ నోట జవాద్ జైదీ కవిత్వం
ఎవరీ అలీ జవాద్ జైదీ ఏమిటా కథ
Ali Jawad Zaidi : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ స్వతహాగా సాహితీ ప్రియుడు. జర్నలిస్ట్ గా పని చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా కళాకారులు, సాహితీ ప్రియులు, కవులను గుర్తు చేసుకుంటారు.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లో నూతన న్యాయ సముదాయాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి అలీ జవాద్ జైదీ(Ali Jawad Zaidi) రాసిన పద్యాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా చదివి వినిపించారు. దీంతో ఎవరీ జైదీ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.
ఆయన పూర్తి పేరు సయ్యద్ అలీ జవాద్ జైదీ(Ali Jawad Zaidi). 10 మార్చి 1916లో పుట్టాడు. 6 డిసెంబర్ 2004లో మరణించారు.
భారతీయ స్వాతంత్ర కార్యకర్త. న్యాయవాది. సివిల్ సర్వెంట్. కవి. ఉర్దూ సాహిత్యంలో పేరు మోసిన రచయిత.
కవులు మీర్ అనిస్ , మీర్జా గాలీబ్ లతో సహా ఉత్తర ప్రదేశ్ లోని మార్సియాగో కవిత్వంపై సాధికారిత కలిగి ఉన్నాడు జైదీ.
పరిశోధన, విశ్లేషణాత్మక రచనలతో సహా కవిత్వం, గద్వాన్ని రెండింటి మీదా పట్టుంది ఆయనకు. సాహిత్యం, ఇతర రంగాలలో చేసిన కృషికి గాను అనేక అవార్డులు పొందారు అలీ జవాద్ జైదీ.
యూపీలోని కర్హన్ గ్రామంలో పుట్టాడు. లక్నో యూనివర్శిటీలో లా చదివాడు. విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నాడు. విప్లవ కవిత్వం రాశాడు.
బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా కవిత్వం రాశాడు జైదీ.
జైలు శిక్ష అనుభవించాడు. సివిల్ సర్వెంట్ గా సమాచార శాఖలో పని చేశాడు. శ్రీనగర్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నాడు.జమ్మూ కాశ్మీర్ లో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు.
వేసవి నెలల్లో వార్షిక కాశ్మీర్ ఉత్సవాలు చేపట్టాడు. ఆనాటి ప్రభుత్వంలోని సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సొసైటీ జనరల్ గా నియమించబడ్డాడు. 1960లో ఢిల్లీ, ముంబైలలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పని చేశాడు.
1978లో ఆల్ ఇండియా రేడియోలో జాయింట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాడు. ఉర్దూ మాస పత్రిక నయా దౌర్ , ముంబై నుంచి ప్రచురించే ఆల్ ఇల్మ్ అనే మాస పత్రికకు సంపాదకుడిగా పని చేశారు జైదీ.
సాహిత్య అకాడెమీలో ఉర్దూ నుంచి ఇంగ్లీష్ కు అనువాదం చేశాడు. విదేశాలలో విస్తృతంగా పని చేశాడు. దేశాధినేతలు,
ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పని చేశాడు జైదీ. ఆయన రాసిన ఏడు పుస్తకాలకు అవార్డులు అందాయి.
ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో 80కి పైగా పుస్తకాలు రాశాడు. ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గాలీబ్ అవార్డు దక్కింది.
1987లో తన రచనలను అవార్డుల కోసం పరిగణించ వద్దని ప్రభుత్వ సంస్థలు, సాహిత్య సంస్థలను కోరాడు.
Also Read : తెలంగాణ విమోచన పోరాట యోధుడు చోళ లింగయ్య