Bandi Sanjay A1 : రాష్ట్రంలో పేపర్ లీకేజీల వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికే పేపర్ లీక్ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బుధవారం ఈ కేసుకు సంబంధించి సీపీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు.
పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ ని(Bandi Sanjay A1) చేర్చారు. ఇక రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు ఆయన పీఏను కూడా చేర్చారు.
ఈ కేసులో ఏ2గా ప్రశాంత్ , ఏ3గా మహేష్ కూడా ఉన్నారని తెలిపారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో బండి సంజయ్ తో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్ పై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా పేపర్ లీక్ కు సంబంధించి బీజేపీ చీఫ్ , ఎంపీ బండి సంజయ్ ని(Bandi Sanjay A1) మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు, నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేక పోయినా ఈటల పేరును ఎలా ఇరికిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే సీపీ రంగనాథ్ పేపర్ లీక్ కు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టారు. ఎవరు ఇందులో పాలు పంచుకున్నారనే దానిపై వివరాలు వెల్లడించారు. మొత్తంగా ఈ కేసు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రాజకీయాలకు అతీతంగా పోరాడుదాం
