Ponnam Prabhakar : మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం
బీఆర్‌ఎస్పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలన్నారు...
Ponnam Prabhakar : బీసీలకు కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar Slams..
బీఆర్‌ఎస్పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సర్వేపై అక్కడక్కడా అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని ప్రజలను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కోరారు. వేములవాడ రాజన్నను మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దర్శించుకున్నారు.
నిన్న(ఆదివారం) హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క బీసీ డిక్లరేషన్ హమీ అయినా అమలు చేసిందా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో కులగణన పూర్తయిన తరువాత, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము కులగణనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇంటింటి సర్వేకు వచ్చే అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్రఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతులకు పంటపై బోనస్ రూ.500లు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క బీసీకైనా వడ్డీ లేని రూ.10లక్షల రుణం ఇచ్చారా? అని ప్రశ్నించారు.ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. తొలి ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.8వేల కోట్లే ప్రకటించిందని, అవికూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని విమర్శించారు. బీసీ వెల్ఫేర్‌తో పాటు ఎంబీసీలకు మరో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారని, తన క్యాబినెట్‌లో 18మంది మంత్రులను భర్తీ చేసుకునే చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి అని, కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తా.. అంటే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : MLA KTR : కాంగ్రెస్ హయాంలో 34 మంది గీత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు