Minister Ponnam Prabhakar : తెలంగాణ రవాణా శాఖలో ఎనలేని మార్పులు తీసుకొచ్చాం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పలు కీలక విషయాలు వెల్లడించారు...

Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో ఆధునీకరణకు దోహదపడే పలు చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పలు కీలక విషయాలు వెల్లడించారు.

Minister Ponnam Prabhakar – వాహనాల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం

వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు సక్రమంగా జరగకపోవడం, డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్‌లు (ATS) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాల పొల్యూషన్, ఫిట్‌నెస్ వంటి అంశాలను ఒకే చోట పరిశీలించేందుకు వీలుగా వాహన సారథి సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు.

ఏఐ ఆధారిత లైసెన్స్‌లు, ట్రైనింగ్ మూడటివేలు

ఆర్టీఏ వ్యవస్థను సమకాలీకరిస్తూ, ఏఐ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు విధానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్ల తప్పిదం ఉన్నట్టు తేలితే, లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతోంది. అలాగే, ప్రత్యేక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, వాటిలో శిక్షణ పొందిన వారికే లైసెన్స్ జారీ చేయనున్నట్టు తెలిపారు.

వాహనాల స్క్రాప్ పాలసీ & ఈవీ ప్రోత్సాహం

15 ఏళ్లను దాటి నడుస్తున్న వాహనాలను స్క్రాప్‌కు పంపే విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు ప్రజల భద్రత కూడా బలోపేతం అవుతుందన్నారు. ఇందులో భాగంగా ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

నల్లగొండలో రెండవ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో రూ.8 కోట్ల వ్యయంతో రెండవ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ కు శంకుస్థాపన జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రంలో రెండవ కేంద్రంగా గుర్తింపు పొందనుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలులో మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్‌లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

బస్సుల పెంపు, డిపో అభివృద్ధి విజ్ఞప్తి

నిజాం యుగంలో ప్రారంభమైన నార్కెట్‌పల్లి డిపోలో ప్రస్తుతం 60 బస్సులు సేవలందిస్తున్నాయని, మరిన్ని 20 బస్సులు అవసరమని కోమటిరెడ్డి సూచించారు. అలాగే, నల్లగొండ డిపోకు నూతన భవనం నిర్మించాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.

Also Read : Bhumana Slams Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ పై భగ్గుమన్న మాజీ టీటీడీ చైర్మన్

Leave A Reply

Your Email Id will not be published!