Posani Krishna Murali : పోసానికి బిగ్ షాక్
పోలీసులు కేసు నమోదు
Posani Krishna Murali : అమరావతి – ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, ఏపీ ఫిల్మ్ డెవపల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Posani Krishna Murali Comments Viral
జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ నేతలు రాజమండ్రి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పోసానికి వంత పాడారంటూ , ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోసాని కృష్ణ మురళిపై(Posani Krishna Murali) గత్యంతరం లేక రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పై 535, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు పోసాని కృష్ణ మురళి.
Also Read : PM Modi KCR : మోదీ కామెంట్స్ కలకలం