Posani Krishna Murali : జగన్ దమ్మున్నోడు – పోసాని
ప్రజల కోసం పని చేస్తున్నాడు
Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డబ్బులు తినకుండా పని చేస్తున్నాడని అన్నారు. ఆయన ప్రజా సేవలో నిమగ్నమయ్యాడని కొనియాడారు. ఏపీ రాష్ట్రానికి ఇప్పటి వరకు పని చేసిన ముఖ్యమంత్రులలో జగన్ ఒక్కడే జనం కోసం పాటుపడుతున్నాడని పేర్కొన్నారు.
Posani Krishna Murali Comments
కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు కమ్మగా ఉండడం బాధగా ఉందన్నారు. విలువలు వదిలేసి, వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత బాబుకే దక్కుతుందని సంచలన ఆరోపణలు చేశారు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali).
దేశంలో కేవలం విద్యా రంగానికి అత్యధిక ప్రయారిటీ ఇచ్చిన ఘనత ఒక్క జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇవాళ రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందని , దీనిని చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు.
విద్యను వ్యాపారమయంగా మార్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ నిప్పులు చెరిగారు.
Also Read : Rahul Gandhi : ద్వేషం వల్ల దేశం అభివృద్ది చెందదు