Posani Krishna Murali : ముద్రగడను తిట్టడం దుర్మార్గం – పోసాని
నిప్పులు చెరిగిన కృష్ణ మురళి
Posani Krishna Murali : ఏపీ వైసీపీకి చెందిన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిప్పులు చెరిగారు. ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పనిగట్టుకుని కాపులను లక్ష్యంగా చేసుకుని, కాపుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న వాళ్లను తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.
పోసాని కృష్ణ మురళి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ చీఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పడితే అది మాట్లాడటం నాయకుల లక్షణం కాదన్నారు. ఎవరో చెబితే నాయకులు కాలేరన్నారు. నేతలు , చరిత్ర నిర్మాతలు కేవలం ప్రజల్లోంచి వచ్చారని అది తెలుసుకుంటే మంచిదని సెలవిచ్చారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.
ముద్రగడలో ముద్ర గడ్డ ఉందన్నారు. ఆయనంటే తనకు ప్రేమ చాలా ఉందని స్పష్టం చేశారు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali). నేను కమ్మ వాడినైనా గౌరవం కూడా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కాపు అయి ఉండి ముద్రగడ పద్మనాభంను తిట్టడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు కంటే జగన్ లక్ష రెట్లు మంచోడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఎవరి గురించి ఎలా మాట్లాడో ముందు తెలుసుకుని మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు మంచిదని సూచించారు పోసాని.
Also Read : Uttam Kumar Reddy : ప్రచారం అబద్దం ఉత్తమ్ ఆగ్రహం
