Prabhas Wishes : మెగాస్టార్ భోళా శంక‌ర్ స‌క్సెస్

త‌ప్ప‌క అవుతుంద‌న్న ప్ర‌భాస్

Prabhas Wishes : మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌నతో పాటు త‌మ‌న్నా భాటియా, కీర్తి సురేష్ క‌లిసి న‌టించారు భోళా శంక‌ర్(Bhola Shankar). దీనికి మెహెర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ , టీజ‌ర్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మూవీ మేక‌ర్స్ ఆగ‌స్టు 11న శుక్ర‌వారం చిత్రం విడుద‌ల చేసేందుకు ముహూర్తం నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ముంద‌స్తు టికెట్లు బుక్ కావ‌డం విశేషం. ఓవ‌ర్సీస్ లో కూడా పండుగ చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్.

Prabhas Wishes to Mega Star

ఇక మెగాస్టార్ డ్యాన్సుల‌తో హోరెత్తించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు టాలీవుడ్ ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా. భోళా శంక‌ర్ చిత్రం విడుద‌లైన సంద‌ర్భంగా పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ విషెస్ చెప్పారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం లో చిరంజీవికి ఇది ఒక మైలు రాయిగా మిగిలి పోతుంద‌న్నారు ప్ర‌భాస్. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ బిల్లా సినిమాలో న‌టించాడు. అది త‌మిళ్ రీమేక్ ఫిలిం. మొత్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి భోళా శంక‌ర్ పై. మెగా స్టార్ స్టెప్పులు, డైలాగులు ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా కానున్నాయి.

Also Read : Minister KTR : మెట్రో విస్త‌ర‌ణ‌పై కేటీఆర్ ఫోక‌స్ ‍‍‍‍‍‍‍‍‍‍

Leave A Reply

Your Email Id will not be published!