ఒకే ఒక్కడు ప్రభ్ సిమ్రాన్ సింగ్ మెరిశాడు. పంజాబ్ కింగ్స్ ను ఒడ్డుకు చేర్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆపై ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు దోహద పడ్డాడు ఈ యంగ్ క్రికెటర్. అసాధారణమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక పోరులో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 167 రన్స్ చేసింది. ప్రత్యర్థి జట్టును 131 పరుగులకే పరిమితం చేసింది. హర్ ప్రీత్ బ్రార్ తన బౌలింగ్ తో తిప్పేశాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.
ఓ వైపు వికెట్లు రాలుతున్నా ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఎక్కడా చెక్కు చెదరేలేదు. ఆ జట్టులో సింగ్ తో పాటు సామ్ కరన్ ఒక్కడే రాణించాడు. 20 రన్స్ చేశాడు. ఇక సింగ్ 65 బంతులు ఎదుర్కొని 103 రన్స్ చేశాడు. రాహుల్ చాహర్ 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో అడుగు ముందుకేసింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ధాటిగా ఆడినా ఆ తర్వాత చేతులెత్తేసింది. పంజాబ్ బౌలర్ల దెబ్బకు ఠారెత్తింది. వార్నర్, సాల్ట్ మెరిసినా ఓటమి తప్పలేదు.
