Praggnanandhaa : మోదీని కలిసిన ప్రజ్ఞానంద
అభినందించిన ప్రధానమంత్రి
Praggnanandhaa : ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన పట్టుమని 19 ఏళ్లు కూడా నిండని తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద తన పేరెంట్స్ తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Praggnanandhaa Met PM Modi
ఈ సందర్భంగా చెస్ ఛాంపియన్ షిప్ టోర్నీలో ఫైనల్ కు చేరుకున్నాడు ఈ చెన్నైకి చెందిన కుర్రాడు. రష్యాకు చెందిన క్రీడాకారుడి చేతిలో ఫైనల్ లో ఓటమి పాలయ్యాడు. రన్నర్ అప్ గా నిలిచాడు. భారత దేశం తరపున చెస్ క్రీడా పరంగా చూస్తే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అత్యంత పిన్న వయసు కలిగిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు ప్రజ్ఞానంద.
అత్యంత పేదరికం కుటుంబం నుంచి వచ్చిన ఈ చదరంగపు మేధావి తన కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించాడు. లెక్కలేనన్ని షీల్డులు ఉన్నాయి. స్మరించు కోదగిన చరిత్ర కూడా ఉంది. తాజాగా ప్రజ్ఞానంద(Praggnanandhaa) దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఫైనల్ లో ఓడి పోయినా అసలైన విజేత ప్రజ్ఞానంద అని ప్రశంసలు కురిపించాడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.
తనను కలిసిన ప్రజ్ఞానందను, పేరెంట్స్ ను అభినందించారు ప్రధాన మంత్రి. నేటి భారత దేశ యువతకు నువ్వు స్పూర్తి దాయకంగా నిలుస్తావంటూ ప్రశంసించారు.
Also Read : YS Sharmila : ఇక విలీనమే మిగిలింది