Prakash Raj : స్మృతీ ఇరానీపై ప్రకాశ్ రాజ్ ఫైర్
ఫ్లయింగ్ కిస్ సరే మీ వాళ్ల మాటేంటి
Prakash Raj : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. ఓ వైపు మణిపూర్ కాలి పోతుంటే ఇంకో వైపు ఫ్లయింగ్ కిస్ పేరుతో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాద్దాంతం చేయడం దారుణమని పేర్కొన్నారు. ట్వి్ట్టర్ వేదికగా గురువారం ఆయన స్పందించారు. దేశంలో సవాలక్ష సమస్యలతో జనం అల్లాడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారు ఎన్నో కేసులలో ఇరుక్కున్నారు. ప్రత్యేకించి యావత్ దేశం అవమాన భారతంతో తలదించుకుంది.
Prakash Raj Comments
మీ పార్టీకి చెందిన ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగింకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహిళా మల్ల యోధులు రోడ్డు పైకి వచ్చారు. కానీ ఏనాడూ బీజేపీకి చెందిన మీరు, మీ మహిళా ఎంపీలు , ప్రజా ప్రతినిధులు ఒక్కసారైనా వారి తరపున ప్రశ్నించారా, నిలదీశారా, మాట్లాడారా అని ప్రశ్నించారు ప్రకాశ్ రాజ్(Prakash Raj).
ఇవాళ కాలిపోతున్న, మండిపోతున్న, తగులబడి పోతున్న మణిపూర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రశ్నతో పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ఇకనైనా మారాలని సూచించారు. లేక పోతే దేశం కూడా తగులబడి పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది. దేశం చూస్తోందని గమనించాలన్నారు.
Also Read : Mahua Moitra : ప్రతిపక్షాలు మాట్లాడితే పట్టించుకోరా