Prakash Raj Modi : ప్రధానిపై ప్రకాశ్ రాజ్ సెటైర్
బీజేపీ, మోదీపై తీవ్ర ఆగ్రహం
Prakash Raj Modi : భారత దేశంలో కేంద్ర సర్కార్ తో పాటు భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో మొదటివరుసలో ఉన్నారు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.
ఇవాళ హైదరాబాద్ వేదికగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజుతో పాటు పార్టీకి చెందిన సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కొన్నేళ్ల తర్వాత జరుగుతున్న అతి పెద్ద సమావేశం. మోదీ హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ఉంటారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రిని గత కొంత కాలంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj Modi).
ఆయన ట్విట్టర్ వేదికగా శనివారం స్పందించారు. ఆయన గత కొంత కాలం నుంచీ తెలంగాణలో కొలువు తీరిన సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పాలనను ప్రశంసిస్తూ వస్తున్నారు.
ఒక రకంగా ప్రకాశ్ రాజ్ మౌత్ పీస్ గా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో పాటు ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా తెలంగాణ సూపర్ అంటూ కితాబు ఇచ్చారు. నగరానికి విచ్చేస్తున్న మోదీకి స్వాగతం. పాలన ఎలా ఉండాలో , అభివృద్ధి అంటే ఏమిటో హైదరాబాద్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు ప్రకాశ్ రాజ్.
Also Read : యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగతం
Dear supreme leader.. welcome to Hyderabad..in the states ruled by BJP ..tax payers money is spent in crores to lay roads for your highness visit.. but here it is spent for us Citizens…enjoy the ride n hope you will learn how to deliver infrastructure with a vision #justasking pic.twitter.com/dj5ZVwU6fD
— Prakash Raj (@prakashraaj) July 2, 2022