Prashant Kishor : పీకే రాక‌తో రాత మారేనా హ‌స్త‌గ‌త‌మ‌య్యేనా

మార‌నున్న దేశ రాజ‌కీయ ముఖ చిత్రం

Prashant Kishor : భార‌త దేశ రాజ‌కీయాల‌లో కొత్త ప‌రిణామం చోటు చేసుకోనుంది. 137 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది.

గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఆ పార్టీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతోంది. ఇటీవ‌ల దేశంలోని ఐదు రాష్ట్రాలు ఉత్త‌ర ప్ర‌దేశ్ , 

మ‌ణిపూర్, ఉత్త‌రాఖండ్, గోవా, పంజాబ్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ ఒక్క స్టేట్ లో త‌న ఉనికిని చాటు కోలేక పోయింది.

విచిత్రం ఏమిటంటే ప‌వ‌ర్ లో ఉన్న పంజాబ్ లో సైతం కేవ‌లం 18 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ కొలువు తీరింది. 

117 సీట్ల‌కు గాను 92 సీట్ల‌ను క‌ట్ట‌బెట్టారు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు. ఆప్ కొట్టిన దెబ్బ‌కు న‌లుగు మాజీ సీఎంలు మ‌ట్టి క‌రిచారు.

మొబైల్ షాప్ లో మెకానిక్ గా ప‌ని చేస్తున్న వ్య‌క్తి చేతిలో మాజీ సీఎం చ‌న్నీ ఓట‌మి పాల‌య్యారు. 

ఇది ప‌క్క‌న పెడితే ఈ ఏడాది ఆఖ‌రులో గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో 2023 ప్రారంభంలో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

2024లో దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇప్ప‌టి నుంచే స‌మాయ‌త్తం కావాలంటే చాలా క‌ష్ట ప‌డాల్సి ఉంటుంది. 

గ్రామాల నుంచి న‌గ‌రాల వ‌ర‌కు పార్టీకి క్యాడ‌ర్ ఉన్నా విజ‌యం సాధించ‌లేక పోతోంది.

నాయ‌క‌త్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. స‌క్సెస్ ఫుల్ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా పేరొందిన 

ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor ) క‌న్స‌ల్టెంట్ గా ఉంటాడా లేక వా పార్టీలో చేరుతారా అన్న‌ది ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

ఈ త‌రుణంలో సోనియా గాంధీ ఫ్యామిలీతో నాలుగుసార్లు ఈ వారం రోజుల్లో భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది.

 త‌ల‌పండిన మేధావులు, రాజ‌కీయ నాయ‌కులు, కాక‌లు తీరిన యోధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

వారే ఆ పార్టీకి భారంగా, గుదిబండ‌గా మారారన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని గ‌ట్టెక్కించాలంటే ఎవ‌రో ఒక‌రు నిపుణుడైన డాక్ట‌ర్ కావాలి. అదే ఇప్పుడు జ‌రుగుతోంది పీకే(Prashant Kishor ) రూపంలో.

ఢిల్లీ, పంజాబ్ ల‌లో ఆప్ , ప‌శ్చిమ బెంగాల్ లో టీఎంసీ, కేర‌ళ‌లో సీపీఎం, త‌మిళ‌నాడులో డీఎంకే, తెలంగాణ‌లో టీఆర్ఎస్ , 

ఏపీలో వైసీపీ, మ‌హారాష్ట్రలో శివ‌సేన ఇలా అన్ని ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

యూపీలో ఎస్పీ, బీఎస్పీ ఉన్నాయి. వీరింద‌రిని ఒకే తాటి పైకి తీసుకు రావాలంటే రిస్క్ తీసుకోవాల్సి ఉంది. 

ఇందుకు మ‌ధ్యే మార్గంగా పీకే బ్లూ ప్రింట్ త‌యారు చేశారు. మేడం సోనియా గాంధీ స‌మ‌యంలో పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

ఇందులో ప్ర‌ధానంగా మొత్తం 594 సీట్ల‌లో 370 సీట్ల‌లో కాంగ్రెస్ పోటీ చేయాల్సి ఉంటుంది. 

మిగ‌తా 224 సీట్ల‌లో ప్రాంతీయ పార్టీల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని కేటాయించాల‌ని సూచించారు.

ఇలాగైతే ఆక్టోప‌స్ లా అల్లుకు పోయిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఢీకొన‌గ‌లిగే చాన్స్ ఉంటుంద‌ని పేర్కొన్నారు పీకే.

Also Read : సాయిరెడ్డిని త‌ప్పించ‌డంతో వాళ్లు హ్య‌పీ

Leave A Reply

Your Email Id will not be published!