Prasidh krishna Ruled Out : రాజ‌స్థాన్ కు స్టార్ పేస‌ర్ దూరం

వెన్నునొప్పితో ప్రసిద్ద్ కృష్ణ క‌ష్టం

Prasidh krishna Ruled Out : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ ఏడాది 2023 ఐపీఎల్ షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. మార్చి 31 నుంచి మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. మే 28న ఫైన‌ల్ ఉంటుంద‌ని పాత ప‌ద్ద‌తి ప్ర‌కార‌మే ఈసారి కూడా ఐపీఎల్ జ‌రుగుతుంద‌ని తెలిపింది. లీగ్ లో మొత్తం 74 మ్యాచ్ లు జ‌రుగుతాయి. తాజాగా గ‌త సీజ‌న్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో రాణించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన స్టార్ బౌల‌ర్ దూర‌మ‌య్యాడు. వెన్ను నొప్పి కార‌ణంగా అత‌డు ఆడ‌డం లేద‌ని స‌మాచారం.

గ‌త ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజస్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో ఫైన‌ల్ కు చేరింది. పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ తొలిసారిగా ఐపీఎల్ 2022 ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ త‌రుణంలో కీల‌క‌మైన ఆట‌గాడిగా, బౌల‌ర్ గా మారాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్ర‌సిద్ద్ కృష్ణ‌(Prasidh krishna Ruled Out). గ‌త కొంత కాలం నుంచి వెన్ను ముక నొప్పితో బాధ ప‌డుతున్నాడు.

ఈ వ్యాధితో దీర్ఘ కాలంగా ఇబ్బంది ప‌డుతున్న కార‌ణంగా ఈ ఏడాది జ‌రిగే ఐపీఎల్ లో దాదాపు పూర్తిగా దూర‌మైన‌ట్లేన‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తెలిపింది. మ‌రో వైపు రాజ‌స్థాన్ కు డైరెక్ట‌ర్ , మెంటార్ గా ఉన్న శ్రీ‌లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్క‌ర ఈ విష‌యంపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. ప్ర‌సిద్ద్ కృష్ణ అందుబాటులోకి రాక పోతే అత‌డి స్థానంలో ఎవ‌రిని నియ‌మిస్తుంద‌నేది ఉత్కంఠగా మారింది.

Also Read : రెండో టెస్టుకు వార్న‌ర్ దూరం

Leave A Reply

Your Email Id will not be published!