Prathinidhi Movie : ప్రతినిధి మూవీ పోస్టర్ సూపర్
జర్నలిస్ట్ మూర్తి ప్రయత్నం
Prathinidhi Movie : తెలుగు మీడియాలో తనకంటూ ఓ స్పేస్ కలిగిన జర్నలిస్ట్ మూర్తి(Murthy Journalist). అటు రవి ప్రకాశ్ ను తట్టుకుని నిలబడగలిగిన జర్నలిస్టులలో కొందరున్నారు. వారిలో మూర్తి కూడా ఒకరు. జర్నలిస్టుగా పని చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం నరకమే. ప్రస్తుతం ఆయన ఓ పేరొందిన ఛానల్ లో పని చేస్తున్నారు.
Prathinidhi Movie Life Story
తాజాగా తన జీవిత కాలంలో చోటు చేసుకున్న అనుభవాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన కెరీర్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలకు దృశ్య రూపకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతినిధి పేరుతో చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. ఆయన అద్భుతమైన కథను తయారు చేసుకున్నారు.
ఇందులో నారా రోహిత్ హీరోగా నటిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తనకు తోడుగా , నీడగా, ఆసరాగా ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ తెలిపారు. ఇదే సమయంలో తనకు కొండంత అండగ నిలిచిన హీరో రోహిత్ కు థ్యాంక్స్ తెలిపారు జర్నలిస్ట్ మూర్తి.
Also Read : Tiruchi Siva : ఎంపీపై వేటు అప్రజాస్వామికం – తిరుచి శివ