Mohammed Rizwan : విరాట్ కోహ్లీ కోసం అల్లాను ప్రార్థిస్తా
రిజ్వాన్ సంచలన కామెంట్
Mohammed Rizwan : భారత, పాకిస్తాన్ దేశాల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇరు జట్లు ఆడుతున్నాయంటే మరో యుద్దం జరిగినట్లే భావిస్తారు ఫ్యాన్స్. కానీ ఆటగాళ్లు మాత్రం తమకు ఆట తప్ప భేదాభిప్రాయాలు లేవంటూ ప్రకటించారు ఇప్పటికే.
గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది.
ఈ సందర్భంగా భారత జట్టుకు చెందిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకించి ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ తో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను అభినందించారు.
వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. యావత్ క్రీడా ప్రపంచం విస్తు పోయింది. భారత క్రికెట్ ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడా స్పూర్తికి సలాం చేసింది. ఇక మరో భారత ఆటగాడు చటేశ్వర పుజారా, రిజ్వాన్ లు ఇంగ్లండ్ లోని లీగ్ లో ఆడుతున్నారు.
వీరిద్దరూ కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కలిసే ఫోటోలు దిగారు. వారిద్దరూ హాట్ టాపిక్ గా మారారు. తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా పేరొందిన భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి. ఇటీవల ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కోహ్లీకి బాసటగా నిలిచాడు. అతడు తిరిగి ఫామ్ లోకి రావాలని తాను అల్లాను ప్రార్థిస్తానని పేర్కొన్నాడు రిజ్వాన్(Mohammed Rizwan).
Also Read : ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ గా మెక్ కల్లమ్