UPSC Chairman : యూపీఎస్సీ నయా చైర్మన్ గా ప్రీతి సుడాన్ ఎన్నిక..
దానితోపాటు ఆమె దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ పదవికి ఎంపికయ్యారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి...
UPSC Chairman : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 2025, ఏప్రిల్ 29వ తేదీ వరకు లేకుంటే.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఆమె కొనసాగుతున్నారు. ఆగస్ట్ 1వ తేదీన ఆమె యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోని.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త యూపీఎస్సీ చైర్మన్ నియామకం అనివార్యమైంది. ఇటీవల వరకు యూపీఎస్సీ చైర్మన్‌గా గుజరాత్‌కు చెందిన మనోజ్ సోని ఉన్నారు. 2029 ఏడాది చివర వరకు ఆయన ఆ పదవిలో కొనసాగవలసి ఉంది. కానీ వ్యక్తిగత కారణాలతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఆ కొద్ది రోజుల ముందే.. మహారాష్ట్రలోని పుణె ట్రైయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది.
New UPSC Chairman…
దానితోపాటు ఆమె దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ పదవికి ఎంపికయ్యారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. సరిగ్గా అలాంటి వేళ యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పూజా ఖేద్కర్ అంశానికి మనోజ్ సోని రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టత ఇచ్చింది. అదీకాక మనోజ్ సోని.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడనే ఓ ప్రచారం సైతం సాగుతుంది. 1983, బ్యాచ్ ఐఏఎస్ అధికారి.. ప్రీతి సుదాన్. ఇక ప్రీతి సుదాన్(Preeti Sudan) భర్త రణదీప్ సుదాన్ సైతం ఐఏఎస్ అధికారే. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్‌లు. ఉమ్మడి ఏపీలోని వివిధ జిల్లాలకు వీరిద్దరు కలెక్టర్లుగా పని చేసిన విషయం విధితమే.
Also Read : Minister Dola : ఇంటర్ విద్యార్థిని ‘అర్చిత’ ఆత్మహత్యపై విచారణకు ఆదేశించిన మంత్రి