AP New Cabinet : ఏపీ కేబినెట్ లో బ‌హుజ‌నుల‌కే ప్ర‌యారిటీ

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు 70 శాతం ప‌దవులు

AP New Cabinet  : ఏపీ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఊహించ‌ని రీతిలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కొత్త కేబినెట్ (AP New Cabinet ) లో 25 మంది కొలువు తీరారు. ఈసారి బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప్ర‌యారిటీ ఇచ్చారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు 70 శాతం మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా బీసీ డిక్లేరేష‌న్ ను చిత్త‌శుద్దితో అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఈసారి ఏకంగా న‌లుగురు మ‌హిళ‌ల‌కు చోటు క‌ల్పించ‌డం విశేషం. పాత కేబినెట్ లో లాగానే ఈసారి ఐదుగురికి డిప్యూటీ సీఎంన పోస్టులు కేటాయించ‌నున్నారు. ఇ

ప్ప‌టికే కొత్త జాబితాను(AP New Cabinet )గ‌వ‌ర్న‌ర్ కు పంపించారు. మంత్రి ప‌ద‌వులు కేటాయించిన వారిలో ఎక్కువ శాతం బ‌హుజ‌నుల‌కే ప్ర‌యారిటీ ఇచ్చారు. ఇది ఎన్నిక‌ల కోసం చేసిన మంత్రివ‌ర్గం కాద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

అయితే సామాజిక న్యాయం నినాదం కాద‌ని తాము ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించామ‌ని పేర్కొన్నారు. గ‌తంలో ఎన్నిక‌ల కంటే ముందు జ‌గ‌న్ రెడ్డి చేసిన పాదయాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు బ‌హుజ‌నుల‌కే ప్ర‌యారిటీ ఇస్తామ‌ని. ఆ మేర‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం నిల‌బెట్టుకున్నారు.

2019లో ప‌వ‌ర్ లోకి రాగానే వీటిని ఆచ‌ఱ‌న‌లో పెట్టిన ఘ‌న‌త ఏపీ సీఎందే. గ‌త కేబినెట్ లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు ప‌ద‌వులు ద‌క్కితే 11 మంది ఓసీల‌కు ఛాన్స్ ఇచ్చారు.

ఇక పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త కేబినెట్ లో బీసీల‌కు 10, ఎస్టీ 1, మైనార్టీ 1, ఎస్టీల‌కు 5 స్థానాల‌కు కేటాయించారు.

Also Read : రాబోయే కాలం మ‌న‌దే గెలుపు భారం మీదే

Leave A Reply

Your Email Id will not be published!