Sapna Gill Selfie Row : పృథ్వీ షా ఎవ‌రో నాకు తెలియ‌దు

స‌ప్నా గిల్ షాకింగ్ కామెంట్స్

Sapna Gill Selfie Row : క్రికెట‌ర్ పృథ్వీ షా ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది కేసు న‌మోదైన స‌ప్నా గిల్. క్రికెట‌ర్ పై దాడి చేసిన కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అంధేరి కోర్టులో హాజ‌రు ప‌రిచారు.

కోర్టు ఆమెను ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీకి పంపింది. ఈ సంద‌ర్భంగా సప్నా గిల్ త‌ర‌పు న్యాయ‌వాది సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు క్రికెట‌ర్ పై. పృథ్వీ షాకు మ‌ద్యం తాగే అల‌వాటు ఉంద‌ని, అందుకే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అత‌డిపై నిషేధం విధించిందని , ఇందుకు సంబంధించి మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను ప్ర‌స్తావించారు.

స‌ప్నా గిల్ రూ. 50,000 ఇచ్చి కేసు ముగించాల‌ని ఏనాడూ చెప్ప‌లేద‌న్నారు . దీనికి సంబంధించి ఎలాంటి రుజువు లేదు. స‌ప్నా గిల్ ఒక ఇన్ ఫ్లుయెన్స‌ర్ . 15 గంట‌ల త‌ర్వాత పృథ్వీ షా త‌న స్నేహితుడి ద్వారా ఎందుకు ఫిర్యాదు చేయ‌లేనద‌ని లాయ‌ర్ ప్ర‌శ్నించాడు. ఇదే స‌మ‌యంలో కోర్టు ప్రాంగ‌ణంలో హాజ‌రైన స‌ప్నా గిల్ పృథ్వీ షాను తాను ఎప్పుడూ క‌లుసు కోలేద‌ని , త‌న‌కు ఆయ‌న‌కు మ‌ధ్య ఎలాంటి స్నేహం కూడా లేద‌ని తెలిపింది.

నా ఫ్రెండ్ పృథ్వీ షాను సెల్ఫీ అడిగాడు. క్రికెట‌ర్ అని అప్ప‌టి దాకా తెలియ‌దు. మేం ఇద్ద‌ర‌మే ఉన్నాం. కానీ షా ఎనిమిది మంది స్నేహితుల‌తో ఉన్నారు. అప్ప‌టికే పృథ్వీ షా తాగి ఉన్నాడ‌ని ఆరోపించింది స‌ప్నా గిల్(Sapna Gill Selfie Row). ఇదిలా ఉండ‌గా మీడియాతో మాట్లాడిన ఆమె క్రికెట‌ర్ చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని ఆరోపించింది.

Also Read : ఫ‌హాద్ తో నటి స్వ‌ర భాస్క‌ర్ పెళ్లి

Leave A Reply

Your Email Id will not be published!