Prithvi Shaw : హమ్మయ్య రాణించిన పృథ్వీ షా
38 బంతులు 7 ఫోర్లు ఒక సిక్సర్ 54 రన్స్
Prithvi Shaw : ఐపీఎల్ 16వ సీజన్ లో పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సత్తా చాటాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ తో కలిసి 94 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఓ వైపు కెప్టెన్ వార్నర్ రెచ్చిపోతే మరో వైపు పృథ్వీ షా పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుతమైన షాట్స్ తో అలరించాడు. 38 బంతులు ఎదుర్కొన్న షా ఒక సిక్సర్ 7 ఫోర్లతో 54 కీలక పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోర్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు. కొన్ని షాట్స్ కళాత్మకంగా ఆడాడు.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చివరి వరకు పోరాడింది. 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఆశించిన ఆ జట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది డేవిడ్ వార్నర్ సేన.
లియామ్ లివింగ్ స్టోన్ చిచ్చర పిడుగులా దంచి కొట్టాడు. అద్భుతమైన షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్ల భరతం పట్టాడు. ఏకంగా 94 పరుగులు చేసినా చివరకు తన టీమ్ ను గట్టెక్కించ లేక పోయాడు.
Also Read : David Warner