Priyanka Chaturvedi : మంత్రి సోమన్నపై ప్రియాంక కన్నెర్ర
మహిళ పట్ల ఇలాగేనా వ్యవహరించేది
Priyanka Chaturvedi : కర్ణాటక భారతీయ జనతా పార్టీకి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి వి. సోమన్న మహిళపై దాడి చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ హై కమాండ్ కూడా ఆరా తీయడంతో రాష్ట్ర సీఎం బస్వరాజ్ బొమ్మై వెంటనే స్పందించారు.
నిన్న రాత్రి డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి కన్ను మూశారు. ఈ విషాద సమయంలో మంత్రి చెంప చెళ్లుమనిపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలంటూ మంత్రి సోమన్నను ఆదేశించారు సీఎం. దీంతో హుటా హుటిన సోమన్న సీఎం నివాసానికి వెళ్లినట్లు సమాచారం.
తాను కావాలని కొట్టలేదని , ఇదంతా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి. సోమన్న దాడికి పాల్పడడాన్ని సీరియస్ గా స్పందించారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi). వెంటనే మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కమీషన్, కరప్షన్ కు అలవాటు పడిన బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి మంత్రులే కావాల్సి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
మరో వైపు టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా కూడా స్పందించారు. మంత్రికి మహిళల పట్ల ఏ పాటి గౌరవం ఉందనేది ఈ ఘటన చూస్తే తెలుస్తుందన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే మంత్రి సోమన్నను పదవి నుంచి తొలగించాలని, బీజేపీ నుంచి బహిష్కరించాలని కోరారు ఎంపీ.
Also Read : మోదీ..షా’ మృగాళ్లను బయటకు పంపారు