Priyanka Daughter : రాహుల్ యాత్రలో ‘ప్రియాంక..కూతురు’
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన కోడలు
Priyanka Daughter : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ముందుండి ఎన్నికల ప్రచారం నిర్వహించి విజయం దక్కేలా చేసిన ప్రియాంక గాంధీ ఇప్పుడు సోదరుడు చేపట్టిన యాత్రలో పాల్గొన్నారు.
అంతే కాదు ఆమె కూతురు(Priyanka Daughter) కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొనడం విశేషం. రాజస్థాన్ లోని బుండీ జిల్లాలోని తేజాజీ మహారాజ్ నుండి ఉదయం 6 గంటలకు తిరిగి సోమవారం ప్రారంభమైంది. నారీ శక్తి పాదయాత్రగా దీనిని అభివర్ణించింది పార్టీ. వందలాది మంది మహిళలు చలిని లెక్క చేయకుండా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు.
ఆయనకు సంఘీభావం తెలిపారు. మహిళలతో పాటు ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, వారి కూతురు కూడా పాల్గొన్నారు. సోదరుడు చేపట్టిన యాత్ర సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రియాంక గాంధీ సారథ్యంలో మహిళా యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. బాబాయి నుండి స్వైమాధోపూర్ జిల్లా లోని పిపాల్ వాడ వరకు యాత్ర సాగింది.
కోటా లాల్సోట్ మెగా హైవేపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు జనం పెద్ద ఎత్తున ఆదరించారు. రాహుల్ , ప్రియాంక అంటూ నినాదాలు చేశారు.
వారితో పాటు కలిసి కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఇదిలా ఉండగా రాహుల్ చేపట్టిన యాత్ర ఇవాల్టితో ఏడో రోజు. బుండి జిల్లాలో ఇది చివరి రోజు కావడం గమనార్హం. ఈ యాత్రలో 5 వేల మందికి పైగా మహిళలు పాల్గొనడం విశేషం.
Also Read : రాటు దేలిన రాహుల్ గాంధీ