Priyanka Gandhi : ప్రియాంక చేతిలో ‘దైవభూమి’ భవితవ్యం
సీఎం ఎవరో ప్రకటించనున్న హైకమాండ్
Priyanka Gandhi : దైవభూమిగా భావించే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా సీఎం ఎవరనేది క్లారిటీ రాలేదు. రాష్ట్ర రాజధాని సిమ్లా లోని రాడిసన్ హోటల్ లో ఎన్నికైన 40 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
పార్టీ పరిశీలకులుగా రాష్ట్ర ఇన్ చార్జ్ రాజీవ్ శుక్లా, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ పై దాడి చేసినంత పని చేశారు ప్రతిభా సింగ్ మద్దతుదారులు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం 68 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి మించి గెలుచుకుంది. ఇక్కడ ప్రియాంక గాంధీ అన్నీ తానై పర్యటించారు.
చివరకు కీలక సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్టీకి సంబంధించి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దీంతో అన్నీ తానై ముందుండి నడిపించిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఈ మేరకు సీఎం ఎవరనే దానిపై ఇవాళ క్లారిటీ రానుందని విశ్వసనీయ సమాచారం.
విజయంలో కీలక భూమిక పోషించిన ఆమెకే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అప్పగించారు. ఇప్పటి వరకు హై డ్రామా చోటు చేసుకుంది. ఇక ఏ మాత్రం చిన్నపాటి అవకాశం దక్కినా వెంటనే ఎగరేసుకు పోయేందుకు భారతీయ జనతా పార్టీ కాచుకుని కూర్చుంది.
దీంతో గతంలో చోటు చేసుకున్న అనుభవాల దృష్ట్యా ఏ ఒక్క ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా రాడిసన్ హోటల్ లో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తంగా దైవభూమి భవితవ్యం ఇప్పుడు ప్రియాంక చేతిలోకి వెళ్లింది.
Also Read : సీఎం ఎంపిక నిరసన సెగ