Priyanka Gandhi : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై విచార‌ణ చేప‌ట్టాలి

ప్రియాంక గాంధీ ప్ర‌ధాన డిమాండ్

Priyanka Gandhi : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది భార‌త రెజ్లింగ్ సంఘం (డ‌బ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ వ్య‌వ‌హారం. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా 30 మందికి పైగా మ‌హిళా రెజ్ల‌ర్లు ఆందోళ‌న‌కు దిగారు. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని వెంట‌నే అత‌డిని త‌ప్పించాల‌ని ధ‌ర్నాకు దిగారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. ఇవాళ రెండో రోజు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. 72 గంట‌ల్లోగా నివేదిక ఇవ్వాల‌ని కోరింది. బ్రిజ్ భూష‌న్ శ‌ర‌ణ్ సింగ్ తో పాటు కోచ్ లు కూడా మాన‌సికంగా, శారీర‌కంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఈ మొత్తం అంశంపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) . ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను వేధింపుల‌కు గురి చేసిన డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని, ఆయ‌న ఎంపీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు ప్రియాంక గాంధీ. ఇప్ప‌టికే ఆందోల‌న చేప‌ట్టిన వారిలో జాతీయ స్థాయిలో, అంత‌ర్జాతీయ టోర్నీల‌లో విజేత‌లుగా నిలిచిన వారు ఉన్నార‌ని ఆమె ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. మ‌హిళా రెజ్ల‌ర్లు చేప‌ట్టిన ఆందోన‌కు తాము పూర్తి మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు ప్రియాంక గాంధీ.

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్పడుతున్న బీజేపీ నేత‌ల జాబితా రోజు రోజుకు పెరుగుతోంద‌ని మండిప‌డ్డారు ప్రియాంక గాంధీ.

Also Read : రెజ్ల‌ర్ల‌కు బ‌బితా ఫోగ‌ట్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!