Priyanka Gandhi : దొరకు ఓటేస్తే అవినీతికి వేసినట్టే
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక
Priyanka Gandhi : తెలంగాణలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దొరకు ఓటు వేస్తే అవినీతికి వేసినట్టేనని పేర్కొన్నారు. ప్రజలు ఏమరుపాటుగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం దొంగలకు ఓటు వేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Priyanka Gandhi Comment
మాయ మాటలు చెప్పడం, మోసం చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీ , ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని మండిపడ్డారు.
ఇకనైనా జాగ్రత్తగా ఉండక పోతే ప్రజాస్వామ్యంలో ప్రమాదం పడుతుందన్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ప్రజలు కేసీఆర్ ను భరించే స్థితిలో లేరన్నారు. మార్పు కావాలని కోరుకుంటున్నారని ఇది తథ్యమన్నారు. తమకు ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాదని భారత రాక్షస సమితి పార్టీగా అభివర్ణించారు.
Also Read : Rahul Gandhi : కేసీఆర్ మోసం నిరుద్యోగులకు శాపం