Rahul Gandhi : కేసీఆర్ మోసం నిరుద్యోగులకు శాపం
అశోక్ నగర్ లో రాహుల్ ములాఖత్
Rahul Gandhi : హైదరాబాద్ – ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలనంగా మారారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊహించని రీతిలో ఆయన హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. పోటీ పరీక్షలకు అడ్డాగా పేరు పొందిన అశోక్ నగర్ కు చేరుకున్నారు. ఇది హాట్ టాపిక్ గా మారారు. దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు. దీనికి ప్రధాన కారణం ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఐటీ హబ్ వేదికగా కొందరితో ముచ్చటించారు.
Rahul Gandhi Shocking Comments
కానీ ఉస్మానియా యూనివర్శిటీకి గానీ అశోక్ నగర్ లో చదువుకుంటున్న నిరుద్యోగుల వద్దకు వెళ్లలేదు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాత్రం అందుకు భిన్నంగా తాను ప్రజల మనిషినని నిరూపించుకున్నారు. నేరుగా నిరుద్యోగుల వద్దకు వెళ్లారు. వారితో ముచ్చటించారు. వారి బాధలను విన్నారు.
ఈ సందర్భంగా యువత తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని కానీ తమను నమ్మించి మోసం చేశాడంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదంటూ వాపోయారు.
నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు లిటిగేషన్స్ ఉండేలా కావాలని సర్కార్ ప్లాన్ చేసిందంటూ ఆరోపించారు. కేసీఆర్ నిర్వాకం కారణంగా 40 లక్షల నిరుద్యోగులను మోసం చేశాడంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఆధారంగా భర్తీ చేస్తామని ప్రకటించారు.
Also Read : Mallikarjun Kharge : బక్కోడు కాదు బకాసురుడు
