Priyanka Gandhi : మహిళా రెజ్లర్లపై దాడి దారుణం
ప్రియాంక గాంధీ కామెంట్స్
Priyanka Gandhi : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) నిప్పులు చెరిగారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బుధవారం అర్ధరాత్రి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన మహిళా రెజ్లర్లపై ఖాకీలు దాడికి పాల్పడడాన్ని తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తాయని వాపోయారు.
తమ కష్టార్జితం, అంకిత భావంతో ఈ దేశానికి , కుటుంబాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చారని, ఎన్నో పతకాలతో జాతీయ పతాకాన్ని విపణి వీధిలో ఎగురవేసేలా చేశారని పేర్కొన్నారు. అలాంటి మహిళా రెజ్లర్ల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. కనీసం మహిళలు అన్న ఇంకిత జ్ఞానం మరిచి పోయి దాడికి పాల్పడతారా అంటూ నిలదీశారు.
ఇదిలా ఉండగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగింక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మహిళా రెజ్లర్లు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది రెజ్లర్లు రోడ్డు పైకి వచ్చారు. గత నెల ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగారు.
Also Read : ఖాకీల దాడిపై మాలిక్ మండిపాటు