Priyanka Gandhi : దేశ రాజకీయాలలో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా మారారు. దేశంలో నెలకొన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూనే పాలక పక్షాన్ని నిలదీస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు.
మహిళా స్వరాన్ని వారి గళాన్ని మరింత శక్తివంతంగా వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi ). ఇవాళ ఆమె పుట్టిన రోజు.
1972 జనవరి 12న పుట్టారు. ఆమె తండ్రి దివంగత రాజీవ్ గాంధీ. తల్లి సోనియా గాంధీ. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ. ఆమె నాయినమ్మ ఇందిరా గాంధీ. దేశానికి దిశా నిర్దేశనం చేసిన అరుదైన నాయకుల వారసత్వానికి ప్రతీకగా నిలిచారు ప్రియాంక గాంధీ.
ఆమె ప్రముఖ వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరో వైపు పార్టీ కి సంబంధించి తల్లి సోనియాకు, రాహుల్ గాంధీకి చేదోడుగా ఉంటూ వచ్చారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. మొదట్లో రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ రాను రాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆమె కూడా ఎంటర్ అయ్యారు.
ప్రస్తుతం టాప్ లీడర్లలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi )కూడా ఒకరుగా ఉన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. వారి కోసం తాను సైతం మీకు అండగా ఉంటానని ప్రకటించారు.
ప్రతి ఒక్కరు చదువు కోవాలని, విద్యాధికులు అయితేనే సమాజంలో గౌరవం ఉంటుందని అంటున్నారు. అంతే కాదు మహిళలు, యువతులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
చట్టాలు చేసే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం లేక పోవడాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల్లో తల్లి తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం పార్టీకి ఆమె ఐకాన్ గా ఉన్నారు.
Also Read : ఓఎన్జీసీ సీఎండీగా అల్కా మిట్టల్